Monday, May 20, 2024

దసరా సేల్.. రూ. 86 వేల ఫోన్.. రూ. 40 వేలకే..

spot_img

దసరా పండగ సందర్భంగా ఈ-కామర్స్ కంపెనీలు ఫెస్టివల్ ఆఫర్లతో జనాలను ఆకర్షిస్తున్నాయి. అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’, ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’లో వివిధ రకాల ప్రొడక్ట్స్ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్‌ అప్లయెన్సెస్‌, ఫ్యాషన్స్.. ఇలా అన్ని వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను అందిస్తోంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్‎లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.

Read Also: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో విషాదం.. సీఎం కేసీఆర్ సంతాపం

ఐఫోన్ 14ను ఇప్పుడు మీరు రూ. 56,999కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 14 (Blue, 128 GB) అసలు ధర రూ. 69,900 కాగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 18 శాతం తగ్గింపు ఉంది. దాంతో రూ. 56,999కే అందుబాటులో ఉంది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్‌ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లతో ఈ డివైజ్‌ను మరింత తక్కువకు సొంతం చేసుకోవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ S22 ధర రూ. 39,999కి తగ్గింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 85,999. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 53 శాతం తగ్గింపు అనంతరం గెలాక్సీ S22 రూ. 39,999 అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గుతుంది.

మోటొరోలా ఎడ్జ్ 40 నియో 5జీ ఫోన్ తాజా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 22,999కి లభిస్తోంది. మోటొరోలా ఎడ్జ్ 40 నియో (Caneel Bay 256 GB, 12 GB RAM) ఫోన్ ధర రూ. 29,999గా ఉండగా.. 23 శాతం తగ్గింపు ఉంది. బ్యాంక్ ఆఫర్లు దీనికి అదనం.

Read Also: అత్తను గన్‎తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు

మోటొరోలా ఎడ్జ్ 40 ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 24,999కి లభిస్తోంది. మోటొరోలా ఎడ్జ్ 40 MOTOROLA Edge 40 Nebula Green, 256 GB, 8 GB RAM) ఫోన్ ధర రూ. 34,999గా కాగా.. 28 తగ్గింపు ఆఫర్ ఉంది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లు కలుపుకుంటే.. మరింత తక్కువకే లభిస్తుంది.

ఒప్పో రెనో 8 ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 27,249కే కొనుగోలు చేయవచ్చు. ఒప్పో రెనో 8 (OPPO Reno8 5G Shimmer Black, 128 GB, 8 GB RAM) అసలు ధర రూ. 38,999గా ఉండగా.. 30 తగ్గింపు ఆఫర్ ఉంది.

Read Also: రేపటి నుంచి దసరా సెలవులు.. స్కూళ్లకు, కాలేజీలకు వేరువేరుగా..

ఐకూ నియో 7 5జీ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లలో రూ. 28,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ (IQOO Neo 7 5G Frost Blue, 128 GB, 8 GB) RAM) అసలు ధర రూ. 34,999గా ఉండగా.. 17 శాతం తగ్గింపు ఉంది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లు కలుపుకుంటే మరింత తక్కువకే ఈ ఫోన్ లభిస్తుంది.

Latest News

More Articles