Monday, May 13, 2024

వార్నర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌!  

spot_img

ఆసీస్‌ క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్నాడు. ఈ ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశాలున్నాయి. మరి టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత వార్నర్‌ వ్యాఖ్యాతగా అవతారమెత్తనున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో అతడు కామెంటేటర్‌గా అతడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తున్నది.

Also Read.. కూతురి పెళ్లిలో మాజీ భార్యకు కిస్ ఇచ్చిన అమీర్ ఖాన్

భారత జట్టు 2024 నవంబర్‌ – డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటన వెళ్లనున్నది. బోర్డర్‌ – గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌లో వార్నర్‌.. కామెంటేటర్‌గా కొత్త పాత్రలో కనిపించనున్నట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా వర్గాలు చెబుతున్నాయి. వార్నర్‌ కామెంట్రీ బాక్స్‌లోకి వస్తే అది అతడి ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్‌ అభిమానులకు పండుగే అని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

112 టెస్టులు ఆడిన వార్నర్‌.. 204 ఇన్నింగ్స్‌లో 8,729 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలున్నాయి. ఇప్పటికే టెస్టులు, వన్డేల నుంచి తప్పుకున్నా వార్నర్‌.. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.

Latest News

More Articles