Sunday, May 19, 2024

భాగ్యనగరంలో భగ్గుమంటున్న సూరీడు…4నెలలు ఎండలే ఎండలు..!!

spot_img

ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి నెల ఆరంభంలోనే నగరంలో ఎండసెగ షురూ అయ్యింది. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. మంగళవారం గరిష్టంగా మోడా మార్కెట్లో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. సరూర్ నగర్ లోనూ 36.3, బాలనగర్ 35.9, బేగంపేటలో 35.2 డిగ్రీల కంటే ఎక్కుగగా ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈఏడాది ఎండలు భారీగానే ఉంటాయనే సంకేతాలు వాతావరణ శాఖ నుంచి వెలువడుతున్నాయి.

రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో సగటున 34 నుంచి 37డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా పరిధి 37.2 మంచిర్యాల జిల్లా కొండాపూర్ లో 37.2 మహబూబ్ నగర్ జిల్లా ఉడిత్యాలలో 37.7 జనగాం జిల్లా రఘునాథపల్లిలో 34.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాగల రెండు మూడు రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పగటి,ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.

ఇది కూడా చదవండి: కానిస్టేబుల్ అభ్యర్థులకు ఊరట..ఈనెల 12 నుంచి నియామక పత్రాలు..!!

Latest News

More Articles