Sunday, May 19, 2024

ఆధార్‎తో ఆస్తుల అనుసంధానం! హైకోర్టు కీలక ఆదేశాలు

spot_img

ఆధార్-పాన్ కార్డు అనుసంధానం, ఆధార్-ఓటర్ కార్డు అనుసంధానం చూశాం. కానీ, తాజాగా ఆధార్-ఆస్తుల అనుసంధానం చేయాలనే వాదన తెరపైకి వచ్చింది. ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయంపై పరిశీలించి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

Read Also: తమ్ముడికి కిడ్నీ దానం చేసిన భార్యకు తలాక్ చెప్పిన భర్త

దేశంలో ప్రతి ఒక్కరి ఆస్తులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. కాగా, విచారణ సందర్బంగా ప్రతీ ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించి మూడు నెల్లలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక, ఇదే సమయంలో పిటిషనర్ లేవనెత్తిన అంశాలను విజ్ఞాపనగా తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.

అవినీతి, నల్లధనం, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల చర, స్థిరాస్తి పత్రాలను వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీంతో జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ గిరీష్ కత్పాలియాలతో కూడిన డివిజన్ బెంచ్ పైవిధంగా ఆదేశించింది.

Latest News

More Articles