Friday, May 17, 2024

‘వాల్తేరు వీర‌య్య‌’కు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

spot_img

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీర‌య్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక‌లకు విశాఖ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆర్కే బీచ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇప్పటికే సగం పనులు పూర్తి అయినట్లు సినిమా యూనిట్ పేర్కొన్నారు.

ఆర్కే బీచ్‌లో వాల్తేరు వీర‌య్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి లేద‌ని విశాఖ సీపీ తేల్చిచెప్పారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లోనే నిర్వ‌హించుకోవాల‌ని పోలీసులు సూచించారు. ఈ నెల 8వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి లుక్‌ సినిమాపై అంచనాలను పెంచుతున్నది. మాస్‌ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాకు మరింత హైప్‌ వచ్చింది.

Latest News

More Articles