Monday, May 20, 2024

కలలో శ్రీరాముడు కనిపించాడా?అయితే దాని అర్థం ఏంటో కచ్చితంగా తెలుసుకోవల్సిందే..!

spot_img

కలలో కనిపించే విషయాలు జీవితంలోని సంఘటనల గురించి సూచనలను ఇస్తాయి. అదేవిధంగా, మీకు రాముడు కనిపిస్తే లేదా మీ కలలో రామమందిరం కనిపిస్తే దాని అర్థం ఏమిటి? కలలో రాముడు కనిపిస్తే పుణ్యమా? తెలుసుకుందాం.

జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి రామలల్లా విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది . ఓ వైపు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతుండగా మరోవైపు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ రామమందిరానికి సంబంధించి ప్రకటన చేశారు. తన కలలో రాముడు వచ్చి జనవరి 22న గుడికి రానని చెప్పాడని వాంగ్మూలం ఇచ్చాడు. ఇది నిజామా..? నిజంగా రాముడు కలలోకి వచ్చి అలా చేప్పాడా? కానీ, మన కలలో రాముడు కనిపిస్తే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

1. కలలో శ్రీరాముని దర్శనం:
స్వప్న శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తికి కలలో శ్రీరాముడు కనిపిస్తే, అది శుభ సూచకంగా పరిగణించబడుతుంది. అంటే ఆ కలను చూసిన వ్యక్తి తన జీవితంలో రాబోయే కొద్ది రోజుల్లో కొన్ని శుభవార్తలను అందుకోబోతున్నాడని అర్ధం. మీరు ఏవైనా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే…దాని నుండి ఉపశమనం పొందబోతున్నారనడానికి ఇది సంకేతం.

2. కలలో రామ మందిరాన్ని చూడటం:
మీకు కలలో రాముడి గుడి కనిపిస్తే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. మీ దురదృష్టం తొలగిపోతుందని, అదృష్టం కలిసి వస్తుందని అర్థం. అలాగే మీ ప్రణాళికలన్నీ ఎటువంటి సందేహం లేకుండా విజయవంతమవుతాయి. మీ లక్ష్యం త్వరలో నెరవేరుతుంది.

3. కలలో శ్రీరాముడు, హనుమంతుని దర్శనం:
కలలో ఆంజనేయ స్వామి రాముడితో దర్శనమిస్తే శుభసూచకం. రాబోయే రోజుల్లో మీరు మీ అన్ని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారని దీని అర్థం. మీరు దీని నుండి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంది.

4. కలలో పవనపుత్రుడు కనిపించడం:
మీకు కలలో ఆంజనేయ స్వామి గుడి లేదా విగ్రహం కనిపిస్తే, మీకు పవనపుత్రుని అనుగ్రహం లభించిందని అర్థం చేసుకోండి. మీపై కోర్టులో కేసు ఉంటే అందులో మీరు విజయం సాధిస్తారు. మీ శత్రువులను ఓడించడంలో మీరు విజయం సాధిస్తారని దీని అర్థం. రాముడు, రామ భంటు హనుమంతునికి సంబంధించిన ఈ కలలను మీరు చూస్తే, మీరు ఖచ్చితంగా మీ అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మహిళతో సంబంధం పెట్టుకొని, ఆమె కూతురుని రేప్ చేసిన యువకుడు

Latest News

More Articles