Saturday, May 18, 2024

నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు..!!

spot_img

రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలందరికీ ఈ హెల్త్ కార్డులు ఇస్తామని తెలిపారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో బుధవారం నిర్వహించిన హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్ వేర్ సేవలకు హైదరాబాద్ రాజధాని. అయితే నాణ్యమైన వైద్యసేవలు పొందడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలన్నదే నా లక్ష్యం. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కింద పేదలకు ర. 10లక్షల వరకు ఫ్రీ మెడికల్ సర్వీసులను అందిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతిక సాయంలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తాం. డిజిటల్ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీ ని కాపాడుతామని..ప్రపంచ వ్యాక్సిన్లు ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతున్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఆహ్వానం అందలేదు.. అయినా అయోధ్యకి వెళ్తా

Latest News

More Articles