Monday, May 20, 2024

బన్నీకి జాతీయ అవార్డు. సుకుమార్ ఎమోషనల్

spot_img

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు. పుష్ప చిత్రంలో నటనకు గాను బన్నీని అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటన రాగానే బన్నీ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

పుష్ప దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి తదితరులు అల్లు వారి ఇంటికి విచ్చేసి తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుకుమార్ అయితే తీవ్ర ఎమోషనల్ అయ్యారు. అల్లు అర్జున్ ను గట్టిగా హత్తుకుని ఆనందంతో ఊగిపోయారు

బన్నీ తండ్రి అల్లు అరవింద్, అర్ధాంగి స్నేహ కూడా ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest News

More Articles