Friday, May 17, 2024

సూర్యపేటలో వీగిపోయిన అవిశ్వాసం. గులాబీ ఎత్తులకు చిత్తయిన కాంగ్రెస్!

spot_img

సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో ఉత్కంఠకు తెరపడింది. సూర్యాపేట బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. గులాబీ ఎత్తులకు సూర్యాపేటలో మరోసారి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నేతలు చిత్తయ్యారు. మాజీ మంత్రి,స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చతురతతో అవిశ్వాసం విగిపోయింది. సూర్యపేట మరో సారి పరువు పోగొట్టుకున్నారు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలు. కోరం లేకపోవడంతో  అవిశ్వాసం వీగిపోయినట్లు కలెక్టర్ వెంకట్రావు ప్రకటించారు.

అంతకుముందు దళిత మహిళా చైర్ పర్సన్ అన్నపూర్ణపై అవిశ్వాసం సరికాదని నిరసనలు జరిగాయి. పలువురు దళిత బహుజన నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు. సూర్యాపేట మున్సిపాలిటీ వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు పరిచారు.

సూర్యాపేట జనరల్ స్థానంలో దళిత మహిళ అన్నపూర్ణను చైర్ పర్సన్ చేసారు అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి. మొత్తం 48 వార్డుల్లో 32మంది కౌన్సిలర్లు అవిశ్వాసం కోరారు. ప్రస్తుత చైర్మన్ కు మద్దతుగా 15 మంది కౌన్సిలర్లు నిలిచారు.

Also Read.. పెండ్లైన 8 నెలలకే ఆత్మహత్య చేసుకున్న దంపతులు

Latest News

More Articles