Saturday, May 11, 2024

గూగుల్‌లో ఇవి వెతికితే పోలీసులకు చిక్కినట్లే..

spot_img

గూగుల్‌లో దేని గురించైనా వెతకొచ్చు. తేలికగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కానీ కొన్ని విషయాల గురించి వెతికితే మాత్రం చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. అవేంటో చూద్దాం..

బాంబ్‌ను తయారు చేయటమెలా? ప్రెషర్‌ కుక్కర్‌ బాంబ్‌ను తయారు చేయటమెలా? అని వెతికితే పోలీసులు ఇంటి తలుపు తట్టొచ్చు. సెక్యూరిటీ సర్వీసులు ఇలాంటి హానికర అంశాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తాయి మరి. కాబట్టి వీటి గురించి ఎన్నడూ వెతకొద్దు.

పిల్లల అశ్లీల చిత్రాలు, పిల్లల లైంగిక వేధింపులతో కూడిన వీడియోలు నేరం కిందికే వస్తాయి. వీటిని చూసినా, డౌన్‌లోడ్‌ చేసినా పోలీసులను ఇంటికి ఆహ్వానించినట్టే.

నేరాలకు సంబంధించిన ప్రశ్నలను వెతికినా కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. కిడ్నాపింగ్‌, నార్కోటిక్స్‌ వంటి వాటి గురించి వెతికితే పోలీసులు ఇంటికి రావొచ్చు.

అబార్షన్‌తో ముడిపడిన అంశాలను తరచూ వెతికినా ఇబ్బందే. మనదేశంలో వైద్యపరమైన అబార్షన్‌ విషయంలో కచ్చితమైన నియమాలున్నాయి.

వీటిల్లో లోపాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే పోలీసులు అనుమానించే ప్రమాదముందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Latest News

More Articles