Sunday, May 19, 2024

జీర్ణవ్యవస్థ సరిగా లేకపోయినా సోరియాసిస్‌ వస్తుందన్న డాక్టర్లు

spot_img

ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్‌’ చర్మ రోగం ఇప్పుడు భారత్‌లో భారీగా పెరుగుతోంది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని ఇప్పటివరకూ భావించారు. అయితే జీర్ణవ్యవస్థ సరిగా లేకపోయినా..సొరియాసిస్‌కు దారి తీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

జెనెటిక్‌, పర్యావరణ కారణాలున్నా..జీర్ణవ్యవస్థకు సొరియాసిస్‌కు సంబంధముందని తాజా పరిశోధనలు చెబుతున్నాయన్నారు పూణెకు చెందిన ప్రముఖ డాక్టర్ ఆయుశ్‌ గుప్తా. జీర్ణవ్యవస్థ దెబ్బతినటం, చిన్నపేగు, పెద్ద పేగుల్లో మంచి బ్యాక్టిరియా తగ్గిపోవటంతో సొరియాసిస్‌ బారినపడే అవకాశముందని తాజా పరిశోధనలు తేల్చాయి.

Latest News

More Articles