Saturday, May 18, 2024

ప్రొ. హరగోపాల్‌‎పై కేసులన్నీ ఎత్తేయండి.. డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు

spot_img

పౌరహక్కుల నేత, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్ మీద నమోదైన దేశ ద్రోహం కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయన మీద పెట్టిన ఉపా (UAPA) కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీ అంజనీ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీచేశారు.

ప్రొఫెసర్‌ హరగోపాల్‌తోపాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులపై 2022, ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో దేశద్రోహం కేసు నమోదయింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టంతో పాటు మరో 10 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కాగా.. హరగోపాల్ మీద పెట్టిన కేసుల మీద ప్రజాసంఘాలు వ్యతిరేకత వ్యక్తపరచడంతో ఆయన మీద పెట్టిన దేశ ద్రోహం కేసు ఎత్తేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.

కాగా.. హరగోపాల్‎తో పాటు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్‌, ప్రొఫెసర్‌ పద్మజా షా, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వీ రఘునాథ్‌, చిక్కుడు ప్రభాకర్‌ తదితరులు నిందితులుగా ఉన్నారు.

Latest News

More Articles