Monday, May 20, 2024

రెండు నెల‌ల కాంగ్రెస్ పాలనలో రూ. 14వేల కోట్లు అప్పులా

spot_img

బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై మాట్లాడుతోన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలల కాకముందే రూ.14 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత హ‌రీశ్ రావు. ఇవాళ(శనివారం) భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో హరీశ్ రావు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందని రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లి రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారు. మన్యాన్ని విష జ్వరాల నుంచి కాపాడింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధమేనని ఆరోపించారు హరీశ్ రావు. అసెంబ్లీలోనూ అబద్దాలే, ఆదిలాబాద్ లోనూ అబద్దాలేనని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజీలు ఇచ్చింది బీఆర్ఎస్సే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు సున్నా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు తిట్ల పురాణం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు అని నిలదీశారు. రాష్ట్రంలో తిరోగమనం మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ, మిలాఖత్ అయ్యాయని చెప్పారు. అదానీతో కాంగ్రెస్ పార్టీ ఒప్పందాలు చేసుకున్నదని ఆరోపించారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో 7ఏళ్ల జైలు శిక్ష

Latest News

More Articles