Monday, May 20, 2024

ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో 7ఏళ్ల జైలు శిక్ష

spot_img

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ను కష్టాలు వీడట్లేదు. ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్షలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఇమ్రాన్‌, ఆయన భార్య బుష్రా బీబీ కి పాక్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

బుష్రా బీబీ మొదటి భర్త ఖవార్‌ ఫరీద్‌ పెట్టిన కేసుపై ట్రయల్‌ కోర్టు తాజాగా విచారణ జరిపింది. ఇస్లామిక్‌ నిబంధనల ప్రకారం భర్త చనిపోయిన,విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవాలంటే కొంతకాలం విరామం తీసుకోవాలి. ఈ నిబంధనలను తన మాజీ భార్య బుష్రా ఉల్లంఘించిందని ఫరీద్‌ ఆమెపై కేసు పెట్టారు. అంతేకాదు..పెళ్లికి ముందునుంచే బుష్రా, ఇమ్రాన్‌ల మధ్య బంధం కొనసాగిందని ఆరోపించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇమ్రాన్‌ దంపతులకు ఏడేళ్లు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు నిచ్చింది.బుష్రా బీబీ 2017 నవంబరులో ఫరీద్‌ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2018 జనవరిలో ఇమ్రాన్‌ను వివాహం చేసుకున్నారు.

ఇప్పటికే..అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులోనూ ఇమ్రాన్‌కు పదేళ్లు శిక్ష విధించింది పాక్ కోర్టు.

ఇది కూడా చదవండి: దామగుండంలో నేవీ రాడార్‌స్టేషన్‌ వద్దు

Latest News

More Articles