Thursday, May 9, 2024

పూనమ్ వల్లే ఇది సాధ్యమైంది..ఆర్జీవీ ప్రశంసలు

spot_img

బాలీవుడ్‌ నటి, మోడల్‌ పూనమ్‌ పాండేకు టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మద్దతుగా నిలిచారు. ఆమె కారణంగానే దేశమంతటా సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ జరుగుతోందన్నారు. ఇదంతా జరిగింది పూనమ్ వల్లే సాధ్యమైందని ప్రశంసించారు. సర్వైకల్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పూనమ్‌ పాండే ఎంచుకున్న పద్ధతి విమ‌ర్శ‌ల‌ పాలయిందని, ఇది కొంతమందికి అర్థం అవ్వక నచ్చకపోవొచ్చని, కానీ ఏ ఒక్కరూ పూనమ్‌ ఉద్దేశ్యాన్ని ప్రశ్నించలేరని మద్దతు ప్రకటించారు.

కొంతకాలంగా సర్వైకల్‌ క్యాన్సర్‌ తో బాధపడుతున్న పూనమ్ శుక్రవారం చనిపోయిదంటూ ఆమె మేనేజర్‌ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో ‘నేను చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాను’ అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి షాకింగ్‌ వీడియోను షేర్ చేసింది. ఆమె చేసిన ప‌నికి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. క్యాన్సర్ పై అవగాహనా కల్పించడానికి ఎవరైనా ఇలా చేస్తారా అని విమర్శిస్తున్నారు నెటిజన్లు.

Also Read.. పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న యువతుల ముఠా అరెస్ట్

 

 

Latest News

More Articles