Monday, May 20, 2024

దామగుండంలో నేవీ రాడార్‌స్టేషన్‌ వద్దు

spot_img

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్‌ నిర్మాణం వద్దని.. మరో ప్రాంతానికి మార్చాలని బీఆర్‌ఎస్‌ ఎంపీ జీ రంజిత్‌ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్ర రక్షణ శాఖ పునరాలోచన చేయాలని సూచించారు. రూల్ 377 కింద లోక్‌సభలో ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణంతో 400 సంవత్సరాల పురాతనమైన రామలింగేశ్వర స్వామి దేవాలయం, విలువైన అటవీ, ఔషధ వృక్షాలు కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉందన్నారు.
దాంతోపాటు ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటయ్యాక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని స్థానిక ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు నెలకొన్నాయని స్పష్టం చేశారు ఎంపీ జీ రంజిత్‌ రెడ్డి . పూడురు మండల ప్రజానీకం నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఆయన పార్లమెంటరీ రూల్ 377 కింద లోక్‌సభలో ప్రత్యేకంగా రంజిత్ రెడ్డి లేవనెత్తారు. స్థానిక ప్రజలు ఆందోళనలను పరిశీలించి కేంద్ర రక్షణ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. నేవీ రాడార్ స్టేషన్‌ను అక్కడి నుంచి మార్చి వేరే అనువైన ప్రదేశాలని మార్చాలని కోరారు.

ఇది కూడా చదవండి:కొత్త రికార్డును సృష్టించిన బుమ్రా

Latest News

More Articles