Friday, May 17, 2024

నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న 6 నెలల చిన్నారి

spot_img

6 నెలల చిన్నారి తన అద్భుతమైన జ్ఞాపక శక్తితో అంతా నివ్వెరపోయేలా చేసింది.. ఏకంగా ‘నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ’ లో స్థానం దక్కించుకుంది.అంతేకాదు… గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది

కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన ఇడుపులపాటి నితిన్‌, తనూజలు దంపతులు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి 6 నెలల కుమార్తె ఉంది. పేరు జైత్రి. పుట్టిన కొద్దిరోజులకే తనకున్న జ్ఞాపక పటిమ, గుర్తింపు, గ్రహింపు శక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. ఈక్రమంలో పాపకు వివిధ రకాల మొక్కలు చూపిస్తూ వాటి సాధారణ పేర్లతో పాటు శాస్త్రీయ నామాలను చెప్పడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకు పాప వంద రకాల మొక్కల్లో దేని పేరు చెప్పినా వెంటనే ఫ్లాష్‌కార్డ్‌ ఆల్బమ్‌లో వాటిని ఇట్టే గుర్తిస్తోంది. ఇది తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన ‘నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్‌ సంస్థ’ పాప ప్రతిభను పరీక్షించింది. ఆ తర్వాత జైత్రికి ప్రశంసాపత్రంతోపాటు బంగారు పతకాన్ని అందజేసింది.

ఇది కూడా చదవండి: పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న యువతుల ముఠా అరెస్ట్

Latest News

More Articles