Thursday, May 2, 2024

పనులు తెచ్చిన బీఆర్ఎస్.. రద్దు చేసిన కాంగ్రెస్.. గ్రామాలలో ఫ్లెక్సీలు కట్టండి

spot_img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రాష్ట్ర ప్రాజెక్టులు తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. మన ప్రాజెక్టుల మీద మనకే హక్కు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు, రోడ్లను రద్దు చేయడం పురోగమనమా..?  తిరోగమనమా…? మన ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి,  తెచ్చిన నిధులను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసినటువంటి నిధులను గ్రామాలలో ఫ్లెక్సీలుగా కట్టాలి. మనము తీసుకొచ్చిన నిధులు,  పనుల వివరాల జీవో కాపీలను కూడా గ్రామాల్లో పంచాలి. పనులు తెచ్చిన కాంతారావు.. రద్దు చేసిన పాయం.. అంటూ ప్రజలకు వివరంగా తెలియజెప్పాలని మాజీమంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులకు దేశానిర్దేశం చేశారు.

Also Read.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ప్రతి ఆటో కార్మికుడికి నెలకు రూ.10వేల భృతి చెల్లించాలి

‘‘కాంగ్రెస్ తిట్ల పురాణం వెనుక ఫ్రస్టేషన్ ఉన్నది. హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ మంత్రులు సహనం కోల్పోతున్నారు. పాలక పక్షమైన , ప్రతిపక్షమైన మేము ప్రజల పక్షమే.  ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము. ఈ రాష్ట్రంలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా క్షణంలో వాలిపోతాం. మార్చి 15 తో వంద రోజులు నిండిపోతాయి. ఎక్కడ కాంగ్రెస్ నాయకులు కనపడ్డ,  మంత్రులు కనపడ్డ ప్రజలంతా నిలదీస్తూనే ఉండాలి. కేసులు మాకు కొత్త కాదు. ఎన్ని కేసులు పెట్టినా పోరాడి తెలంగాణ సాధించాం. నా మీద 300 కేసులున్నాయి. నన్ను పెట్టని జైలు హైదరాబాదులో లేదు. భవిష్యత్తు మొత్తం బీఆర్ఎస్ పార్టీదే.. ఈ ఓటమి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే.’’ అని కార్యకర్తల్లో ధైర్యం నింపారు హరీష్ రావు.

Also Read.. ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Latest News

More Articles