Thursday, May 2, 2024

కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ప్రతి ఆటో కార్మికుడికి నెలకు రూ.10వేల భృతి చెల్లించాలి

spot_img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎమ్మెల్యే ఎన్నికల్లో మనం ఓడిపోవచ్చు.. కానీ ఎంపీలను గెలిపించుకునే అవకాశం ఉంది..పోయిన ఎన్నికల్లో కూడా ఖమ్మంలో ఒకరు తప్ప అందరు ఓడిపోయారు,  అయినా ఎంపీగా నామ నాగేశ్వరరావు గెలవలేదా..? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్లమెంటు మీద పడదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మణుగూరులో నిర్వహించిన కార్యకర్తల మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ గెలిచాక రైతుబంధు రాలేదు,  పెన్షన్ రాలేదు,  అవ్వ తాతలు ఎదురుచూస్తున్నారు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడటమేనా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఆటో కార్మికుడికి నెలకు పదివేల రూపాయలు భృతి చెల్లించాలి. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కళ్ళు నెత్తికెక్కినాయి. అహంకారంతో మాట్లాడుతున్నారు. మొన్న మన జడ్పీ చైర్మన్ గారు రైతుబంధు పడలేదంటే పోలీసులను పెట్టే బయటికి గెంటేపించారు. రైతుబంధు పడలేదని రైతులు అంటే చెప్పుతో కొడతామని మరొక మంత్రి అంటున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రోజైనా ఫిబ్రవరి దాకా రైతుబంధు పడకుండా ఉన్నదా? కేసీఆర్ ఉద్యోగస్తుల జీతాలు,  ఎమ్మెల్యేలు,  మంత్రుల జీతాలైన ఆపారు గాని రైతుబంధు సక్రమంగా ఇచ్చారు.’’ అని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read.. టెర్రరిస్టులకు, కాంగ్రెస్ నేతలకు తేడా ఏముంది

Latest News

More Articles