Saturday, May 4, 2024

టెర్రరిస్టులకు, కాంగ్రెస్ నేతలకు తేడా ఏముంది

spot_img

భారతదేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలకు, టెర్రరిస్టులకు తేడా ఏముందని ప్రశ్నించారు. ఇవాళ(శనివారం) కరీంగనగర్ లో మీడియాతో మాట్లాడుతూ…కాశ్మీర్ ను ప్రత్యేక దేశం కావాలని టెర్రరిస్టులు, పంజాబ్ ను ఖలిస్తాన్ దేశంగా ప్రకటించాలని ఉగ్రవాదులు చెబుతున్నారు.. కాంగ్రెస్ ఎంపీ సురేష్ భారత్ ను దక్షిణ దేశంగా, ఉత్తర దేశంగా విభజించాలని అంటున్నడు… మరి వాళ్లకు, వీళ్లకు తేడా ఏమిటి?’’అని అన్నారు.

గతంలో రాహుల్ గాంధీ కూడా భారతీయుడిగా చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నానని దేశాన్ని కించపర్చారన్నారు. ఆయన బావ రాబర్ట్ వాద్రా సైతం భారత్ దుర్బల దేశమని భారతీయులను కించపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడే నేతలపై దేశ ద్రోహ కేసు పెట్టాలని కోరారు. భారత్ ను ముక్కలు చేయాలని కోరడం ముమ్మాటికీ దేశ ద్రోహమేనని, ప్రజలంతా వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇది కూడా చదవండి: రేవంత్ పాలన రాక్షస రాజ్యం అయింది.. బాల్క సుమన్

Latest News

More Articles