Saturday, May 18, 2024

పదవికి రాజీనామా చేసిన పంజాబ్‌ గవర్నర్‌

spot_img

పంజాబ్‌ గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ ఇవాళ( శనివారం)తన గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తన పదవికి రాజీనామా చేస్తున్నానని.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన తన రాజీనామా లేఖలో తెలిపారు. ‘నాకున్న బాధ్యతల వల్ల..వ్యక్తిగత కారణాల వల్ల నేను గవర్నర్‌ పదవికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి నా రాజీనామాను అంగీకరించండి.’ అని బన్వారీలాల్‌ తన లేఖలో తెలిపారు.

పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌కి, కేంద్ర పాలిత ప్రాంత గవర్నర్‌ బన్వారీలాల్‌కి మధ్య విబేధాలు నెలకొన్నాయి. గతేడాది నుంచి వారి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్‌లో తరన్‌ తరన్‌లో అక్రమ మైనింగ్‌ జరుగుతుందని, ఇందులో ఎమ్మెల్యే సమీప బంధువు ప్రేమయం ఉందని, పోలీసుల అవినీతిపై కూడా నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ బన్వారీలాల్‌ గతేడాది అక్టోబర్‌లో సిఎం భగవంత్‌మాన్‌కి లేఖ రాశారు. ఈ లేఖపై భగవంత్‌మాన్‌ స్పందించలేదు. అలాగే గతేడాది ఆగస్టులో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే విధంగా తాను రాష్ట్రపతికి సిఫారసు చేస్తానని గవర్నర్‌ ఆ రాష్ట్ర సిఎంకు రాసిన లేఖలో చెప్పారు. ఈ లేఖపై భగవంత్‌మాన్‌ స్పందించారు. రాష్ట్ర ప్రజల్ని గవర్నర్‌ బెదిరించారు. శాంతి భద్రతలు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని భగవంత్‌మాన్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: టెర్రరిస్టులకు, కాంగ్రెస్ నేతలకు తేడా ఏముంది

Latest News

More Articles