Wednesday, May 8, 2024

72 ఏండ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన అండ‌ర్స‌న్‌

spot_img

విశాఖ: భారత లెజెండరీ క్రికెట‌ర్ లాల్ అమ‌ర్‌నాథ్ పేరిట ఉన్న 72 ఏండ్ల‌ రికార్డును బ్రేక్ చేశాడు ఇంగ్లండ్ వెట‌ర‌న్ జేమ్స్ అండ‌ర్స‌న్‌. భారత్ లో టెస్టు మ్యాచ్ ఆడిన అతి పెద్ద వయసున్న ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. 41 ఏండ్ల 187 రోజులు వయసులో వైజాగ్ టెస్టులో ఆడుతున్నాడు అండ‌ర్స‌న్‌.  కాగా, అమ‌ర్‌నాథ్ 1952లో 41 ఏండ్ల 92 రోజుల వ‌య‌సులో పాకిస్థాన్‌పై టెస్టు మ్యాచ్ ఆడారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెట‌ర్ రే లిండ్వాల్‌  (38 ఏండ్ల 112 రోజులు- 1960), భార‌త ఆట‌గాడు షుటే బెన‌ర్జీ (37 ఏండ్ల 124 రోజులు-1949) ఉన్నారు.

విశాఖ‌ప‌ట్ట‌ణంలో జ‌రుగుతున్న రెండో టెస్టులో అండ‌ర్స‌న్ మూడు వికెట్లు తీశాడు. అతడు 700 క్ల‌బ్‌లో చేరేందుకు మ‌రో ఏడు వికెట్ల దూరంలో ఉన్నారు. ప్రస్తుతం ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్, దివంగ‌త షేన్ వార్న్ మాత్ర‌మే 700 పైగా వికెట్లు తీశారు. విశాఖ టెస్టులో భార‌త్ 396 ప‌రుగుల‌కే ఆలౌటైంది. టీ స‌మ‌యానికి 4 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది ఇంగ్లండ్ జట్టు.

Also Read..రేవంత్ పాలన రాక్షస రాజ్యం అయింది.. బాల్క సుమన్

Latest News

More Articles