Monday, May 20, 2024

ఎయిరిండియాకు ఝలక్..మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఉద్యోగులు.!

spot_img

ఎయిరిండియాకు ఝలక్ ఇచ్చారు ఉద్యోగులు. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి దాదాపు 80 విమానాల సేవలు నిలిపోయినట్లు తెలుస్తోంది. సిబ్బంది ఒక్కసారిగా అనారోగ్య కారణాలతో సెలవు పెట్టడమే దానికి కారణమని సమాచారం. సంస్థలో కొన్ని విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ దాదాపు 300 మంది ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవుపై వెళ్లినట్లు సమాచారం.

కొంతకాలంగా క్యాబిన్ క్రూలో ఓ వర్గం అసంత్రుప్తితో ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఏఐఎక్స్ కనెక్ట్, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విలీన ప్రక్రియ షురూ అయినప్పటి నుంచి సిబ్బంది పలు అంశాలపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ విషయాన్ని గత నెల కంపెనీ ద్రుష్టికి ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగుల యూనియన్ తీసుకెళ్లింది. సిబ్బందిలో అందర్నీ సమానంగా చూడటం లేదంటూ ఆరోపించింది. ఇది తమ స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని పేర్కొంది. కాగా సడెన్ గా విమానాలను రద్దు చేయడంపై బుధవారం ఉదయం పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ క్షమాపణలు చెప్పింది. 7 రోజుల్లో ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చని సూచించింది.

ఇది కూడా చదవండి: వేములవాడ రాజన్న ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకున్న ప్రధాని.!

Latest News

More Articles