Saturday, May 18, 2024

క‌రీంన‌గ‌ర్‌లో ఈసీఎల్ఏటీ హెల్త్‌కేర్ సెంట‌ర్

spot_img

హైద‌రాబాద్‌: హెల్త్‌కేర్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉన్న 3ఎం హెల్త్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్‌(హెచ్ఐఎస్), ఈసీఎల్ఏటీ హెల్త్ సొలూష‌న్స్ సంయుక్తంగా క‌రీంన‌గ‌ర్‌లో కొత్త సెంట‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

మంత్రి కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వాషింగ్ట‌న్ డీసీలో జ‌రిగిన స‌మావేశంలో 3ఎం, ఈసీఎల్ఏటీ అధికారుల‌తో భేటీ అయ్యారు. క‌రీంన‌గ‌ర్ కేంద్రంలో మెడిక‌ల్ కోడింగ్‌, క్లినిక‌ల్ డాక్యుమెంటేష‌న్ సేవ‌ల్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ సంస్థ‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

క‌రీంన‌గ‌ర్‌ ఈసీఎల్ఏటీ ఆపరేష‌న్స్ సెంట‌ర్‌లో తొలుత 100 మందికి ఉద్యోగం క‌ల్పించ‌నున్నారు. ఆ త‌ర్వాత ఆ సెంట‌ర్‌లో ఉద్యోగుల సంఖ్య‌ను 200కు పెంచ‌నున్న‌ట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Latest News

More Articles