Saturday, May 18, 2024

డ్రగ్స్ కేసు.. ముగిసిన నవదీప్ ఈడీ విచారణ

spot_img

హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నవదీప్ ఈడీ విచారణ ముగిసింది. విదేశీ డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఆర్ధిక లావాదేవీలు, మనీలాండరింగ్‌పై ఈడీ ఆరా తీసింది. దాదాపు 8 గంటల పాటు ఆయనను ఈడి అధికారులు విచారించారు. ఉదయం 11 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న నవదీప్.. రాత్రి 7 గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.

Also Read.. అబద్దాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదు

ఆయనకు సంబంధించిన మూడు బ్యాంక్ ఖాతాలు, నవదీప్ నడిపిన పబ్ వివరాలు, నైజీరియన్లతో సంబంధాలపై ప్రశ్నించింది. 2017లో సినీ పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కుంభకోణంలో విచారణ నిమిత్తం అక్టోబర్ 10న జాతీయ ఏజెన్సీ ముందు హాజరుకావాలని నవదీప్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.  సెప్టెంబరులో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టిఎస్‌ఎన్‌ఎబి) అధికారులు నవదీప్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Latest News

More Articles