Saturday, May 18, 2024

ఈఎస్ఐ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం

spot_img

హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సంస్థ మాజీ డైరెక్టర్ ను ఈడీ విచారిస్తున్నది. మందులు, యంత్రాల కొనుగులు స్కాంలో దర్యాప్తును వేగవంతం చేసింది ఈడీ. వందలకోట్ల నిధులను దారి మల్లింపుపై ఈడీ ఆరా తీస్తుంది. అలాగే మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నది. గతంలో ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ విచారణను చేపడుతోంది.

ఈ కేసులో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, అధికారులు నాగలక్ష్మితో పాటు మరికొందరిని ఈడీ అధికారులు తమ కార్యాలయానికి పిలిచి విచారణ చేస్తున్నారు. మందులు, పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు, అనర్హులకు టెండర్లను కట్టబెట్టిన విధానాలపై ప్రశ్నిస్తున్నారు.

ఏసీబీ దాఖలు చేసిన చార్జీషీట్ లో వందల కోట్ల రూపాయాల స్కాం జరిగిందని ఆరోపించింది. ఈఎస్ఐ స్కాంపై 2019లో తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. బ్యాంకు ఖాతాలు, ఆస్తులను 2021 లో రూ. 144 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. స్కాం లో గతంలో డైరెక్టర్ దేవికా రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మతో పాటు పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

Latest News

More Articles