Sunday, May 5, 2024

బండ్లగూడలో రౌడీషీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

spot_img

హైదరాబాద్: బండ్లగూడలో జరిగిన రౌడీషీటర్ దారుణ హత్యను పోలీసులు ఛేదించారు. ఆరు రోజుల క్రితం ఓల్డ్‌సిటీలోని బార్కాస్ కు చెందిన షేక్ సయీద్ బావజీర్ హత్యకు గురయ్యాడు. బావజీర్ హత్యలో మున్సిపల్ చైర్మన్ తో పాటు ఇద్దరు రౌడీషీటర్లు ఉన్నారు. ఈకేసులో మొత్తం నలుగురిని అరెస్టు చేయగా.. ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు బండ్లగూడలో ఓ మడిగెను అద్దెకు తీసుకొని ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. భవానీ నగర్ కు చెందిన రౌడీషీటర్ అహ్మద్ బిన్ హజబ్ తో ఫ్రెండ్‌షిప్ ఉంది. అహ్మద్ బిన్ హజబ్ ఈ మధ్య తనకు ప్రాణ‌హాని ఉందని చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ హోంమంత్రిని కలిసాడు.

బావజీర్ హత్యకు హోమో సెక్స్ కారణమని దర్యాప్తులో పోలీసులు తేల్చారు. తన స్నేహితుడైన హిజాబ్ తో హోమో సెక్స్ అలవాటు ఉంది. ఇతనిని అతని స్నేహితులను తీసుకొని రావాలంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ బెదిరింపులు తాళలేక బావజీర్ హత్యకు ప్లాన్ చేశాడు. ఈ కేసులో రెండవ నిందితుడు అహ్మద్ సాదీ రౌడీషీటర్, మూడవ నిందితుడు జల్‌పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాధిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Latest News

More Articles