Friday, May 17, 2024

తెలంగాణలో ఈసారి ఓట్ ఫ్రం హోం విధానం.. కండీషన్స్ అప్లై

spot_img

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. అటు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుంటే.. ఇటు రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్నికలే లక్ష్యంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా.. అక్టోబర్ 3 నుంచి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సారి ఎన్నికల్లో కొత్త విధానాలను అమలు చేయాలని భావిస్తోంది.

Read Also: హైదరాబాద్ సహా జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

అందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల్లో ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలిసారిగా.. ఈ ఓటు ఫ్రమ్ హోమ్ విధానాన్ని కర్ణాటక ఎన్నికల్లో అమలు చేశారు. అక్కడ సక్సెస్ కావడంతో తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఆప్షన్ 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులతో పాటు వికలాంగులకు ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పించాలని ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో 80 ఏళ్లు దాటిన మొత్తం ఓటర్ల సంఖ్యపై సీఈసీ తాజా సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. ప్రస్తుతం తెలంగాణలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4,87,950 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా వారి కోసం పోస్టల్ బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని సీఈసీ సూచించింది. కాగా.. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకునేవారు ముందుగా తమ స్థానిక ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే అధికారులు పోస్టల్ బ్యాలెట్లను సిద్ధం చేస్తారు. ఈ ఓట్ ఫ్రం హోం విధానాన్ని ఇతర ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: బీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తే కాల్చి చంపుతాం.. దంపతులకు బెదిరింపు లేఖలు

Latest News

More Articles