Sunday, May 19, 2024

కేటీఆర్ కారును తనిఖీ చేసిన ఎన్నికల సిబ్బంది

spot_img

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయంగా వేడెక్కింది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా తమ విధులను పకడ్బందీగా నిర్వర్తిస్తోంది. ఎక్కడకక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తోంది.

Read Also: కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరిన ముద్దగోని రామ్మోహన్ గౌడ్

కాగా.. ఎన్నికల విధులలో భాగంగా అధికారులు ఈ రోజు మంత్రి కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది తూప్రాన్ వద్ద ఆపి తనిఖీ చేశారు. ఎన్నికల అధికారులు వాహనాన్ని ఆపడంతో కేటీఆర్ తన వాహన తనిఖీకి పూర్తిగా సహకరించారు. తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డి బయలుదేరి వెళ్లారు.

Latest News

More Articles