Monday, May 20, 2024

టెట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

spot_img

హైదరాబాద్: రేపు(శుక్రవారం) నిర్వహించనున్న టెట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌2 పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని పేర్కొన్నారు.

Also Read.. డెంగీ కేసులు పెరుగుదల ప్రచారంపై స్పందించిన వైద్యారోగ్య శాఖ

పేపర్‌1కు 2,69,557 మంది అభ్యర్థులు, పేపర్‌2కు 2,08,498 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణకు 2,052 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 హాల్‌ సూపరింటెండెంట్ల నియామకం చేపట్టారు. టెట్‌ పరీక్ష సీసీటీవీ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. పరీక్షాకేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్ల గదుల్లో సీసీకెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలను తెరుస్తారని కన్వీనర్ వెల్లడించారు.

Latest News

More Articles