Friday, May 3, 2024

డెంగీ కేసులు పెరుగుదల ప్రచారంపై స్పందించిన వైద్యారోగ్య శాఖ

spot_img

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో డెంగీ కేసులు పెరుగుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్న‌తాధికారులు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ఫీవర్‌ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవన్నారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల పరిస్థితిపై గురువారం వైద్యారోగ్య శాఖ ఉన్న‌తాధికారులు సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ, డీపీహెచ్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్‌ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Also Read.. 13,300 డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి డేట్ ఫిక్స్

అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాల‌ని, ముఖ్యంగా పిల్లలకు జ్వరాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. మీడియా సమావేశాలు నిర్వహించి సీజనల్‌ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునేలా సిద్ధంగా ఉండాల‌ని వైద్యాధికారులు ఆదేశించారు. జ్వర బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. జ్వ‌రాలు నమోదయ్యే చోట పల్లె, బస్తీ దవాఖానలను అప్రమత్తం చేయాలని సూచించారు. ల్యాబ్‌ రిపోర్టులు వచ్చిన 24 గంటల్లోగా చికిత్స ప్రారంభించాలని ఆదేశించారు.

Also Read.. బుమ్రా రాకతో టీమిండియా బలం పెరిగిందా? బౌలింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..!!

ఇటీవల ములుగు జిల్లాలో డెంగీతో వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ నెలలో డెంగీతో నలుగురు మాత్రమే మరణించారని.. మృతులు గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, జాండిస్‌, సికిల్‌ సెల్‌ అనీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు వివరించారు.

Latest News

More Articles