Monday, May 13, 2024

‘బేబి’ టీమ్‌కు షాకిచ్చిన హైదరాబాద్‌ సీపీ!  

spot_img

హైదరాబాద్:  బాక్సాఫీస్‌ వద్ద బంపర్‌ హిట్‌ అందుకున్న బేబి సినిమా నిర్మాతలు వివాదంలో చిక్కుకున్నారు. ఈ చిత్రంపై హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా చిత్రంలో సీన్లు ఉన్నాయన్నారు. డ్రగ్స్‌ను ఏ విధంగా ఉపయోగించాలనే దృశ్యాలను చూపించారని నోటీసులు జారీ చేశారు.

Also Read.. డ్రగ్స్ కేసులో పరారీలో హీరో నవదీప్..!

మాదాపూర్‌లోని ఫ్రెష్‌లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో దాడులు నిర్వహించిన సమయంలో సన్నివేశాలు ‘బేబి’ సినిమాలో ఉన్నాయని సీపీ వివరించారు. అలాంటి దృశ్యాలను చిత్రీకరించొద్దని సినిమా రంగానికి సీపీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు.

Also Read.. డెంగీ కేసులు పెరుగుదల ప్రచారంపై స్పందించిన వైద్యారోగ్య శాఖ

మరోవైపు మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల ఫోన్లను సీజ్‌ చేసినట్లు వివరించారు. డ్రగ్స్‌కు వినియోగదారుడిగా ఉన్న నవదీప్‌ పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు:

Latest News

More Articles