Friday, May 17, 2024

ప్రియుడిపై పగపట్టిన ప్రియురాలు.. షాకిచ్చిన పోలీసులు!

spot_img

హైదరాబాద్: మాజీ ప్రేమికుడి మీద పగ తీర్చుకోవాలన్న ప్రియురాలి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. వివరాల్లోకి వెళితే ఓ లా స్టూడెంట్ తన మాజీ ప్రేమికుడిపై పగతీర్చుకోవాలని నిర్ణయించుకున్నది. ఇందుకుగాను అతడి కారులో గంజాయి పెట్టించి పోలీసులకు సమాచారం అందించి పట్టించింది.

కాగా, పోలీసుల విచారణలో ప్రియురాలి నిర్వాకం వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి యువతితో సహా ఏడుగురు వ్యక్తుల అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 40 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసున్నామని, నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు వెల్లడించారు.

Latest News

More Articles