Sunday, May 12, 2024

క్షమాపణ చెప్పినా క్షమించేది లేదు.. రేవంత్ పై జోగురామన్న సీరియస్

spot_img

నిన్న జరిగిన కాంగ్రెస్ ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండించారు మాజీమంత్రి జోగురామన్న. ఇంద్రవెల్లిలో వందలాది మంది ఆదివాసీలను పొట్టన బెట్టుకుంది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో జోగురామన్న మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ సమైక్య పాలనలో తప్పు జరిగింది, క్షమాపణ చెబుతున్నా అన్నారు. అసలు రేవంత్ కు ఇంద్రవెల్లి స్థూపం తాకే హక్కే లేదు. స్థూపం కట్టిన తర్వాత కూల్చింది కాంగ్రెస్ వాళ్ళే. ప్రజా సంఘాల ఒత్తిడితో ఆ స్థూపం నిర్మాణమైంది.

సమైక్య పాలనలో కనీసం ఆ స్థూపం దగ్గరకు కూడా వెళ్లనివ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వాలు. గద్ధర్ కు కూడా స్థూపం దగ్గరకు వెళ్లనివ్వలేదు. కేసీఆర్ సీఎం అయినాకే స్థూపం దగ్గరకు వెళ్లే స్వేచ్ఛ దొరికింది. నిన్న కూడా ఐదు జిల్లాల పొలిసు పహారాలో ప్రోగ్రాం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏం మాట్లాడారో నిన్న కూడా రేవంత్ అదే మాట్లాడారు. నాగోబా దేవాలయానికి కేసీఆర్ నిధులు ఇస్తే రేవంత్ ప్రారంభోత్సవాలు చేశారు. కేవలం కోటి రూపాయల పనులకు రేవంత్ కు శంఖు స్థాపన చేశారు. సీఎం హోదాలో అబద్దాలు ఆడుతున్నారు. తన భాష తో రేవంత్ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమాన పరిచారు అని అన్నారు జోగురామన్న.

Latest News

More Articles