Friday, May 17, 2024

గుడ్ ‎న్యూస్.. 2 వేల పోస్టుల దరఖాస్తుకు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే?

spot_img

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు గతంలో రిలీజ్ చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది. వాస్తవానికి దరఖాస్తుల స్వీకరణ గడువు సెప్టెంబర్ 27తో ముగిసింది. అయితే తాజాగా గడువును మరికొంత కాలంపాటు పెంచింది ఎస్బీఐ.

అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు చివరి తేదీని పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2వేల పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తులకు గడువు అక్టోబర్ 3 వరకు పొడిగించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 3 వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరోసారి గడువు పెంచే అవకాశం ఉండని స్పష్టం చేశారు.

అర్హతలు:

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2023 ఏప్రిల్ 1 నాటికి 21 ఏళ్లు పైబడి ఉండాలి. అలాగే 30 ఏళ్లు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

SBI పోస్టులకు దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ 2023

దరఖాస్తు రుసుము:

జనరల్/EWS/OBC అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.750, SC/ST/PWBD అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ:

ఈ పోస్టులకు అభ్యర్థులను ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, సైకోమెట్రిక్ మూల్యాంకనం/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

SBI రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్

ఎలా దరఖాస్తు చేయాలి?

  • ముందుగా SBI కెరీర్ పేజీ sbi.co.in/web/careersకి వెళ్లండి.
  • తర్వాత PO 2023 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • ఈ నమోదు తర్వాత, దరఖాస్తు ప్రక్రియతో కొనసాగండి.
  • ఇప్పుడు ఫారమ్ నింపి సబ్మిట్ చేయండి.
  • చివరగా ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి. భవిష్యత్తు సూచన కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.

More News..

చిన్నారి దీక్షిత్ రెడ్డి హత్య కేసు: ముద్ధాయికి మరణ శిక్ష

Latest News

More Articles