Sunday, May 12, 2024

ముషీరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత..పేదల ఇండ్లు కూల్చిన జీహెచ్ఎంసీ..!!

spot_img

ముషీరాబాద్ నియోజవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీనగర్ డివిజన్ లోని స్వామి వివేకానందనగర్ బస్తీలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు పేదల ఇళ్లు కూల్చివేడయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సోమవారం ఉదయం ముషీరాబాద్ ఎమ్మార్వో వెంకటలక్ష్మీ, జీహెచ్ఎంసీ డీఎంసీ తిపర్తి యాదయ్యతోపాటు జీహెచ్ఎంసీ సిబ్బంది జేసీబీలతో బస్తీకి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకునే యత్నంచేసిన బస్తీవాసులను అదుపులోకి తీసుకుని నాంపల్లి పీఎస్ కు తరలించారు. స్థానిక కార్పొరేటర్లు పావని, రవిచారి, బీజేవైఎం నాయకుడు వినియ్ కుమార్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.

ఇది కూడా చదవండి: ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ..ఎక్కువ దరఖాస్తులు అక్కడి నుంచే..!!

స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం సిబ్బంది బస్తీలోని 20ఇళ్లను కూల్చివేశారు. అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకే తాము ఇళ్లను కూల్చివేసినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ పేదలకు అన్యాయం చేయడం సరికాదని ఎమ్మెల్యే ముఠాగోపాల్ మండిపడ్డారు.

Latest News

More Articles