Sunday, April 28, 2024

బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేసేందుకు యానిమల్ రెడీ.!!

spot_img

విడుదలవ్వడమే ఆలస్యం రికార్డులను బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తోంది యానిమల్ మూవీ. ఇప్పటికే బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగులో ఒక్క సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లను రఫ్పాడించింది..ప్రస్తుతం ఓటీటీలోనూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చాలా మందికి బాగా నచ్చేసింది…కాదు..కాదు..మాంచి కిక్క్ ఇస్తోంది.

ఇది కూడా చదవండి: ప్రాణ ప్రతిష్ఠకు హాజరైనందుకు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషనప్ చీఫ్ కు ఫత్వా..!!

ఇండియాలో వసూళ్లలో దూసుకుపోతున్న ఈ మూవీ..అమెరికాలో మార్కెట్లోనూ అంతకుమించే ఆడుతోంది. ఇప్పటివరకు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు మాత్రమే అమెరికాలో బాక్సాఫీస్ వద్ద 15మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి రికార్డ్ కెక్కాయి. తాజాగా ఈ అద్భుతమైన ఫీట్ ను సాధించేందుకు యానిమల్ కేవలం కొన్ని డాలర్ల దూరంలో మాత్రమే ఉంది. అయితే ఈ ఫీట్ నుసాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో ముందు బాహుబలి, తర్వాత ఆర్ఆర్ఆర్ ఉన్నాయి. ఆ తర్వాతే పఠాన్, జవాన్ సినిమాలు ఉన్నాయి. తాజాగా యానిమల్ మూవీ కూడా చేరబోతోంది.

 

 

Latest News

More Articles