Saturday, May 18, 2024

కొత్తిమీర సాగుతో మీ పంట పండినట్లే..ఏడాదికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసా?

spot_img

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది రైతులు ప్రస్తుతం కొత్తిమీరను సాగు చేస్తున్నారు. కొత్తిమీర విక్రయం ద్వారా రైతులు లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. కొత్తిమీర ఎక్కువ ఉత్పత్తి కావాలంటే ఏం చేయాలో అక్కడి రైతులు సలహాలు ఇస్తున్నారు. ఈ సూచలను పాటించినట్లయితే మీరు కూడా కొత్తిమీరను సాగు చేసి లాభాలను గడించవచ్చు.

మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాల్లోని దాబోహ్ గ్రామంలో చాలా మంది రైతులు ఈ కొత్తిమీర పంటను సాగు చేస్తున్నారు. దీనిద్వారా రైతులు ఏటా లక్షల రూపాయలు అర్జిస్తున్నారు. ఇతర పంటలు సాగు చేస్తూనే గత కొన్నాళ్లుగా కొత్తిమీర పంటను సాగుచేస్తున్నట్లు అక్కడి రైతులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా వారి జీవనోపాధి కేవలం కొత్తిమీర సాగుపైనే ఉంది. కొత్తిమీర ఎంతో వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం రైతు కొత్తిమీరను మూడు సార్లు కోసి మార్కెట్లో విక్రయిస్తున్నారు.

అయితే కొత్తిమీర పంటను సాగు చేయాలంటే వరుసల మధ్య దూరం 25 నుంచి 30 సెంటీమీటర్ల మధ్య ఉండాలి. కొత్తిమీర మొక్కల మధ్య దూరం 5 నుంచి 10 సెంటిమీటర్ల వరకు ఉండాలి. మీరు కూడా కొత్తిమీర సాను చేయాలనుకుంటే భూమిని దున్నడానికి ముందు హెక్టారుకు 5 నుంచి 6 టన్నుల ఎరువు వేయాలి. విత్తనాలు విత్తిన తర్వాత మొదటి నీటిపారుదల, మిగిలిన నీటి పారుదల 15 నుంచి 20 రోజుల వ్యవధిలో ఉండాలి. విత్తే సమయంలో సరైన ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ ఉండే విధంగా చూసుకోవాలి. కొత్తిమీర నీటిపారుదల సాగుకోసం 5-5 మీటర్ల వరుసలను తయారు చేస్తే మరింత అనుకూలంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల నీరందించే పని మరింత సులువుగా మారుతుంది. ఒక ఎకరా భూమిలో కొత్తిమీర సాగు చేస్తే…ఒక పంటకు అన్ని ఖర్చులన్నీ పోగా దాదాపు 70 నుంచి 80వేల లాభం వస్తుందని అక్కడి రైతులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : టైగర్ కా హుకూం.. ఈ సారి వరల్డ్ కప్ పక్కా మనదే

 

 

Latest News

More Articles