Saturday, May 4, 2024

తెలంగాణ రాష్ట మాల సంఘాల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలల సమస్యలను పరిష్కారిస్తామన్న బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు అని  తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్  చెరుకు రామచెందర్ ప్రకటించారు. హైద్రాబాద్ బషీర్బాగ్ లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఅరెస్ ప్రభుత్వం అని అన్నారు.

Also Read.. ఒకేసారి 100 గుడ్లను తాగిన యూట్యూబర్.. వైరల్ వీడియో

హైదరాబాద్ నగరంలో ప్రపంచ మేదావి భారత రాజ్యాంగ పితామహుడు, భారత రత్న డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం ఎంతో హర్షించదగ్గ విషయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డా॥బి.ఆర్ అంబేడ్కర్ గారి పేరును పెట్టడం శుభ సూచికంగా బావిస్తున్నామని తెలిపారు. ధళిత బంధు పథకం ద్వారా ధళితులు వ్యాపార వేత్తలుగా అభివృద్ధి చెందడానికి ధళితబందు పథకం అద్భుతంగా ఉన్నదన్నారు.

Also Read.. రాహుల్ గాంధీవి గ్యారేంటీలు కాదు…గారడీలు..

పేదలకు వృద్ధ ప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు అద్భుతంగా ఉన్నాయి. రైతులకు రైతు బంధు, రైతు భీమా, రుణమాఫీ, అందిస్తున్న కేసీఆర్  ప్రభుత్వం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిందన్నారు. ఇలా అనేక సంక్షేమ పతకాలు ద్వారా ప్రజలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో మళ్ళీ బిఆరెస్ అధికారాన్ని చేపట్టాలంటే ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Latest News

More Articles