Friday, May 17, 2024

సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ

spot_img

హైదరాబాద్: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. ఆగంతకుడు కారు అద్దం పగులగొట్టి కొంత నగదు, ఖరీదైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లాడు. జూబ్లీ హిల్స్ జర్నలిస్టు కాలనీలోని బెల్లంకొండ సురేష్ అలియాస్ సురేంద్ర చౌదరికి సాయిగణేష్ ప్రొడక్షన్స్ పేరుతో కార్యాలయం ఉంది.

గురువారం మధ్యాహ్నం సురేష్ కు చెందిన బెంజి కారును కార్యాలయం ముందు నిలిపారు. శుక్రవారం ఉదయం చూడగా కారు ఎడమవైపు వెనుక సీటువద్ద అద్దం పగిలి ఉంది. లోపల ఉంచిన రూ. 50వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలు కని పించలేదు.

ఒక్కో మద్యం సీసా ఖరీదు దాదాపు రూ.28వేలు ఈ మేరకు కార్యాలయ సిబ్బంది. జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని, సీసీ కెమెరాలను పరిశీలించారు. ఘట నపై సురేష్ సతీమణి పద్మావతి ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles