Thursday, May 2, 2024

4 ఏండ్లలో 44 శాతం పెరిగిన చక్కెర రోగులు

spot_img

హైదరాబాద్: దేశంలో డయాబెటిక్‌ విస్ఫోటం ప్రారంభమైందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది 4 ఏండ్లలో 44 శాతం పెరిగిన చక్కెర రోగులు పెరిగారని  ఐసీఎంఆర్‌ తేలిపింది. దేశంలో ప్రస్తుతం ఏకంగా 10.01 కోట్లమంది డయాబెటిక్‌ రోగులు ఉన్నారని, ప్రీ డయాబెటిక్‌ రోగులు 15 కోట్లకు పైగా ఉన్నారట. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన వ్యాసంలో ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

2008 అక్టోబర్‌ 18 నుంచి 2020 డిసెంబర్‌ 17 వరకు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో లక్షమందిని పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. గోవా(వ్యాప్తి రేటు -26.4 శాతం) మధుమేహం వ్యాప్తిలో తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత పుదుచ్చేరి (26.3 శాతం), కేరళ (25.5 శాతం) ఉన్నాయి.  ప్రీ డయాబెటిక్‌ రోగులు పరంగా పుదుచ్చేరి, ఢిల్లీలు అగ్రస్థానంలో నిలిచాయి. ప్రీ డయాబెటిక్స్‌ అత్యధిక జనాభా ఉన్న యూపీ, బీహార్‌, మధ్యప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లు ముందున్నాయని, వచ్చే మూడునాలుగేండ్లలో మధుమేహ విస్ఫోటం చోటుచేసుకోనున్నదని తెలిపింది.

మరోవైపు దేశ జనాభాలో 35.5 శాతం మంది హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతుండగా.. 81.2 శాతం మందిలో చెడు కొలెస్టరాల్‌ స్థాయిలు అసాధారణంగా పెరిగిపోయాయి. 28.6 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇవేకాక  గుండె, మూత్రపిండాలు, కంటి జబ్బులు కూడా భారీగా పెరుగుతున్నట్టు సర్వేలో తేలడం ఆందోలన కలిగిస్తోందని ఐసీఎంఆర్ వెల్లడించింది.

Latest News

More Articles