Saturday, May 18, 2024

మీ పోలింగ్‌ స్టేషన్‌ ఎక్కడుందో ఇలా తెలుసుకోండి

spot_img

హైదరాబాద్: గురువారం (నవంబర్ 30) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా పార్టీలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేశాయి. అయితే, అనేక కారణాలతో కొందరికి పోలింగ్‌ స్లిప్పులు అందకపోయి ఉండొచ్చు. మొబైల్‌ మీ చేతిలో ఉంటే సులువుగా మీ పోలింగ్‌ స్టేషన్‌ వివరాలను తెలుసుకోవచ్చు.

Also Read.. రేపు చింతమడకకు సీఎం కేసీఆర్‌

మీ దగ్గర ఓటరు గుర్తింపు కార్డు ఉంటే ఆ నంబర్‌ను 1950, 92117 28082 నంబర్లకు పంపిస్తే మీ పోలింగ్‌ కేంద్రం వివరాలు ఎస్సెమ్మెస్‌ రూపంలో తెలుస్తుంది. టోల్‌ఫ్రీ నంబరు 1950కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ‘ఓటరు హెల్ప్‌లైన్‌’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని కూడా పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ www.ceotelangana.nic.in లేదా www.electoralsearch.eci.gov.in ద్వారా వివరాలు పొందవచ్చు.

Latest News

More Articles