Saturday, May 4, 2024

బండి సంజయ్ సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టిన గంగుల

spot_img

కరీంనగర్‌లో బండి సంజయ్ అకృత్యాలతో ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు గంగుల కమలాకర్. ఎన్నికల్లో బండి సంజయ్ డబ్బులు పంపిణి చేసినట్టు ఈ సందర్భంగా సీసీ టీవీ ఫుటేజ్‌ను బయటపెట్టారు గంగుల . ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని.. కరీంనగర్ లో గెలిచేది తానె అని అన్నారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సంజయ్ డబ్బులు, మద్యం పంపిణీ చేయలేదని భాగ్యలక్ష్మి టెంపుల్‌లో ప్రమాణం చేస్తారా..? అని సవాల్‌ విసిరారు.నిన్న కొత్తపల్లిలో డబ్బులు పంపిణీ చేస్తుంటే మా వాళ్లు పట్టుకున్నారని చెప్పారు.

డబ్బులు పంచుతూ బండి సంజయ్ అడ్డంగా దొరికిపోయి, రివర్స్‌లో అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని గొడవ చేశారు. బండి సంజయ్ డబ్బులు పంచారని సీసీ ఫుటేజీలో చాలా క్లియర్ గా కనిపించిందన్నారు. ఇంట్లో ఉన్న మా కార్యకర్తపై స్వయంగా దాడులు చేసాడు. మేము డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తున్న సంజయ్ మొదట పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని సూటిగా ప్రశ్నించారు.ఒక ఎంపీవి అయి ఉండి గుండాలను తీసుకుపోయి దాడులు చేస్తావా..ఇంట్లో ఉన్న కార్యకర్తను కొట్టి బూతులు తిడతావా? ఇదేనా దేశం, కోసం ధర్మం కోసం పని చేయడమని ఫైర్ అయ్యారు గంగుల కమలాకర్.

Latest News

More Articles