Sunday, May 12, 2024

వీడియో: నిప్పులు కురిపించిన ఆర్మీ హెలికాప్టర్‌ రుద్ర

spot_img

న్యూఢిల్లీ: ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌ రుద్ర తన సత్తా చాటింది. పర్వత ప్రాంతాల్లో నిప్పులు కురిపించింది. అత్యాధునిక తొలి స్వదేశీ ఎటాక్‌ హెలికాప్టర్ రుద్రాను ఆర్మీకి చెందిన ఏవియేషన్ యూనిట్ విజయవంతంగా పరీక్షించింది. ఈశాన్య ప్రాంతంలోని ఒక ఎయిర్‌ఫీల్డ్‌ లో చేపట్టి ఈ ప్రయోగానికి చెందిన వీడియోను ఇండియన్ ఆర్మీ షేర్ చేసింది.

Also Read.. సచిన్‌ రికార్డును సమం చేసిన విరాట్.. సఫారీ ముందు భారీ టార్గెట్

ఎటాక్‌ హెలికాప్టర్ రుద్ర పర్వతాల్లో పోరాట సామర్థ్యాన్ని చాటిచెప్పింది. రాకెట్ల ద్వారా నిప్పులు ఎగజిమ్మడంతోపాటు గుళ్ల వర్షం కురిపించిన రుద్ర హెలికాప్టర్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 5.8 టన్నుల బరువున్న మల్టీరోల్ ఛాపర్‌లో 20 ఎంఎం టరెట్ గన్, 70 ఎంఎం రాకెట్ సిస్టమ్‌ ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కోసం వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్‌) తయారు చేసింది.

Latest News

More Articles