Sunday, May 19, 2024

18ఏళ్లుగా దుబాయ్ లో జైల్లో ఉన్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి..!!

spot_img

దుబాయ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 5గురు తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. ఓ హత్యకేసులో 18ఏళ్లుగా వీరు జైలు శిక్షను అనుభవిస్తున్నారు. పూర్తి వివరాలు చూస్తే…నేపాల్ కు చెందిన వాచ్ మెన్ బహదూర్ సింగ్ హత్య కేపులో వీరికి తొలుత 10 ఏళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్ కోర్టు శిక్షను 25ఏళ్లకు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేపాల్ వెళ్లి..హతుని కుటుంబ సభ్యులకు రూ. 15లక్షల పరిహారం స్వయంగా చెల్లించారు. క్షమాభిక్ష పత్రం రాయించినా..మారిన నిబంధనలతో దుబాయ్ కోర్టు అంగీకరించలేదు.

అనారోగ్య కారణాలు చూపిస్తూ నిందితుల తరపు న్యాయవాదులు మరోసారి ప్రయత్నించారు. దీనికి అంగీకరించిన దుబాయ్ కోర్టు 7ఏళ్ల ముందే వారిని విడదుల చేసింది. దీంతో దుబాయ్ నుంచి సిరిసిల్ల, రుద్రంగి, కొనరావుపేటకు చెందిన ఐదుగురు హైదరాబాద్ కు చేరుకున్నారు. 18సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో భావోద్వేగా వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి: బీహార్ లో ఘోరరోడ్డు ప్రమాదం…తొమ్మిది మంది మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు..!!

Latest News

More Articles