Sunday, May 12, 2024

కస్టమర్లకు షాకివ్వబోతున్న స్విగ్గీ.. ఆర్డర్‎కు రూ. 10 వసూల్!

spot_img

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ దిగ్గజం స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది. ఫుడ్‌ ఆర్డర్లు పెట్టుకుంటున్న కస్టమర్ల నుంచి ప్లాట్‌ఫామ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్న స్విగ్గీ.. ఆ ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్విగ్గీ ఎక్కువ మంది యూజర్ల నుంచి ఆర్డర్‌ను బట్టి రూ.3 ప్లాట్‌ఫామ్‌ ఫీజులు వసూలు చేస్తుంది. అయితే, పెరిగిపోతున్న డెలివరీలను దృష్టిలో ఉంచుకుని ఆదాయాన్ని మరింత గడించేందుకు కొత్త వ్యాపార ఎత్తుగడలు వేస్తోందని సమాచారం. అందులో భాగంగా రూ.10 ప్లాట్‌ఫామ్‌ ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమైంది. అందుకు అనుగుణంగానే ఆర్డర్‌ చేసిన తర్వాత బిల్లులో ప్లాట్‌ఫామ్‌ ఛార్జీ రూ.10 చూపించి, డిస్కౌంట్‌ పేరుతో రూ.5 మాత్రమే వసూలు చేస్తుంది. రానున్న రోజుల్లో దీనిని పది రూపాయలకు పెంచే యోచనలో ఉందని, కాబట్టే బిల్లులో ఇలా చూపిస్తుందని వినియోగదారులు అభిప్రాయ పడుతున్నారు. జనవరి 1న జొమాటో కూడా తన వినియోగదారుల నుంచి ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.3 నుండి రూ.4 పెంచిందని ఎకనమిక్స్‌ టైమ్స్‌ నివేదించింది.

Read also: సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన పోచారం

Latest News

More Articles