Friday, May 17, 2024

వరి పంటపై మోగి పురుగు ప్రభావంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి

spot_img

సిద్దిపేట: వరి పంటపై మోగి పురుగు ప్రభావంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు మేలు జరిగే విధంగా వ్యవసాయ అధికారులు, శాస్త్ర వేత్తలతో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించాలని కోరారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారితో కలిసి ఆయన నియోజకవర్గ వ్యవసాయ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ తో సాగు నీరు పెరిగిందన్నారు. ప్రతి సంవత్సరం పంట మార్పిడి లేకపోవడం ఓకే పంట సంవత్సరాలు తరబడి సాగు చేయడం వల్ల మోగి పురుగు ఉధృతి రోజురోజుకి పెరుగుతుందని తెలిపారు. వరిలో కాండం తరచు పురుగు ( మోగి పురుగు) పంట అన్ని దశల్లో ఆశించి దిగుబడిని తగ్గిస్తుందని,  రైతులు సరైన సమయంలో, సరైన పురుగుల మందులు , సరైన మోతాదులో వినియోగించినట్లయితే మోగి పురుగు వల్ల వరిలో కలిగే తెల్ల కంకులు లేదా ఊస తిరగడాన్ని తగ్గించి మంచి దిగుబడి పొందవచ్చని సూచించారు.

పురుగు గమనించడానికి దీపపు ఎర  సోలార్( light trap) లేదా లింగాకర్షక బుట్టలను అమర్చుకొని రెక్కల పురుగుపై నిఘా పెట్టాలి.  ప్రధాన పొలంలో గుళికల మందులు వాడితే ఖర్చు ఎక్కువవుతుంది. గనుక నారు నాటే వారం రోజుల ముందు ఎకరాకు సరిపడే నారుమడికి 900 గ్రాముల కార్బోఫ్యురాన్ 3జి గుళికలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 800 గ్రాముల 0.4g  గుళికలు వేయాలని రైతులకు సూచించాలని ఆదేశించారు.  ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలక దశలో ఉన్న వరి పైరులో ఈ యాసంగిలో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యురాన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరంట్రానీలి ప్రోల్ 0.4జి నాలుగు కిలోలు వేయాలని రైతులకు వివరించాలన్నారు. గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు తెలియజేయాలన్నారు. రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

Also Read.. వీడియో కాల్స్ కోసం వాట్సస్ లో కొత్త ఫీచర్ ..ఫ్రెండ్స్ తో స్క్రీన్ షేరింగ్..!!

Latest News

More Articles