Saturday, May 18, 2024

నిజంగానే కేసీఆర్ గుర్తులు మాయం అవుతున్నాయి

spot_img

ఈ నెల 13న నల్గొండ దద్దరిల్లేలా సభ నిర్వహిస్తామన్నారు మాజీ మంత్రి,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ స్వయంగా హాజరై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగడుతారన్నారు. కేసీఆర్ హాజరయ్యే ఛలో నల్గొండ బహిరంగ సభ ఏర్పాట్లను  పరిశీలించిన జగదీష్ రెడ్డి ఆ తర్వాత మాట్లాడారు.

’’చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ దుర్భాషలాడుతున్నారు. రేవంత్ రెడ్డి లాంటోడు ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి. కేసీఆర్ గుర్తులు చేరిపేస్తాం అంటున్న రేవంత్ రెడ్డి  నీచ సంస్కృతి అర్థం అవుతోంది. నిజంగానే కేసీఆర్ గుర్తులు ఇవాళ మాయం అవుతున్నాయి. 24 గంటల కరెంట్ కేసీఆర్ గుర్తు.. ఇవ్వాళ 24 గంటల కరెంట్ మాయం అయ్యింది. రైతు బంధు డబ్బులు కేసీఆర్ గారి చిహ్నం.. అది మాయం చేశారు. రైతు బంధు డబ్బులు అడిగితే చెప్పుతో కొడతాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్లు. నిరంతర మంచి నీటి సరఫరా కేసీఆర్ గుర్తు.. ఇవ్వాళ నీళ్లు రావడం లేదు కేసీఆర్ గుర్తు చేరిగిపోయింది. ఇలాంటి  దొంగల చేతికి ఇవ్వాళ తెలంగాణ పోయింది.. మన దౌర్భాగ్యం‘‘ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కృష్ణా ప్రాజెక్టులను తిరిగి రాష్ట్ర పరిధిలోకి తేకపోతే కాంగ్రెస్ వాళ్ళను గ్రామాల్లో తిరగనీయమని ఆయన హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో బడ్జెట్ లో ఒక్క హామీ గురించి చెప్పలేదు

Latest News

More Articles