Saturday, May 18, 2024

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో బడ్జెట్ లో ఒక్క హామీ గురించి చెప్పలేదు

spot_img

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిరాశ వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కవిత. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో బడ్జెట్ లో ఒక్క హామీ గురించి చెప్పలేదన్నారు. కౌన్సిల్ మీడియా పాయింట్ లో మాట్లాడేన ఆమె..ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో పూర్తి కేటాయింపు లేకపోయినా..రానున్న 5 ఏండ్లకు ప్రణాళికకు సంబంధించి ఎక్కడ లేదు.మీద, మీదనే బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో మైకుల ముందు చెప్పిన హామీలు ఒక్క హామీ గురించి చెప్పలేదు.పాత పేర్లును తీసి కొత్త పేర్లు పెట్టారు. ఈ ప్రభుత్వం ఓన్లీ నేమ్ చెంజింగ్ మాత్రమే, గేమ్ చెంజర్ కాదు.పోయన ప్రభుత్వాలును విమర్శించడానికే సమావేశాలు ఉన్నట్టు ఉందన్నారు.

బడ్జెట్ నిరాశజనకంగా ఉందన్నారు సత్యవతి రాథోడ్. మహిళా సంక్షేమం కోసం కేటాయింపులు, ప్రతిపాదనలు లేవన్నారు. ప్రజలుకు చెప్పిన హామీలు.. బడ్జెట్ లో ఏమీ లేవన్నారు.ఆర్టీసీ ఫ్రీ బస్సు కి మేము హర్షం వ్యక్తం చేసాము. కాని దాని ద్వారా ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులుకు న్యాయం చేయమని కోరామన్నారు. మహా లక్ష్మి పథకానికి ఎంత బడ్జెట్ అని చెప్పలేదు. మాట్లాడితే గత ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పుతున్నారు.10 ఏండ్లలో ప్రతిపక్షంలో ఉండి కాగ్ రిపోర్ట్ చూడలేదా అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్

Latest News

More Articles