Saturday, May 11, 2024

సూర్య నాయక్ లాక్ అప్ డెత్ పై సమగ్ర దర్యాప్తు చేయాలి

spot_img

హైదరాబాద్: నేనావత్ సూర్య నాయక్ లాక్ అప్ డెత్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి సత్యవత్ రాథోడ్, బాల్క సుమన్, దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు.గురువారం వారు డీజీపీని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.   అన్నదమ్ముల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణం అయ్యారని ఆరోపించారు. అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, సీనియర్ అధికారి చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. సూర్య నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. పది సంవత్సరాల నుండి ఫ్రెండ్లీ పోలీసింగ్ లో తాము ఎక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇలాంటి సంఘటనలా వాళ్ళ రాష్ట్ర ప్రతిష్ట మసకబరుతుంది. టీఆర్ఎస్ నాయకుల ఇళ్ల వద్ద డీజే సాంగ్స్ బాణాసంచా కాల్చి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.

Latest News

More Articles